
- మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-రోహన్ జంట కూడా..
- స్విస్ ఓపెన్ సూపర్-300
బస్సెల్: స్విస్ ఓపెన్ సూపర్-300 మెయిన్ డ్రాకు మాల్విక బన్సోద్‌తోపాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-రోహన్ కపూర్ జోడీ అర్హత సాధించింది. అలాగే సీడెడ్ ఆటగాళ్లు కొందరు ఈ టోర్నీకి దూరంగా ఉండడంతో ఆకర్షీ కశ్యప్, కిరణ్ జార్జి, మిధున్ మంజునాథ్ అర్హత మ్యాచ్‌లు ఆడకుండా ప్రధాన టోర్నీకి అర్హత సాధించారు. మంగళవారం జరిగిన అర్హత పోటీల్లో 21ఏళ్ల మాల్విక 21-17, 21-7తో వరుససెట్లలో అమెరికాకు చెందిన లారెన్ లామ్‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌ను మాల్విక కేవలం 31 నిమిషాల్లోనే ముగించింది. మరో మ్యాచ్‌లో ప్రియాంశురాజవత్ 7-21, 5-21తో చైనీస్ తైపీకి చెందిన ఛియా-హో-లీ చేతిలో ఓటమిపాలైంది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-సిక్కిరెడ్డి జోడీ 21-17, 15-21, 21-8తో సింగపూర్ జోడీపై గెలిచింది. మరో మిక్స్‌డ్ పోటీలో అశ్విని పొన్నప్ప-బి సుమిత్‌రెడ్డి జోడీ 20-22, 12-21తో చైనీస్ తైపీ జోడీ చేతిలో ఓడింది. ఇక పురుషుల డబుల్స్‌లో సుమిత్‌రెడ్డి-కపూర్ జోడీ 15-21, 20-22తో మలేషియా జోడీ చేతిలో, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా జోడీ 19-21, 15-21తో చైనా జంట చేతిలో ఓడి ప్రధాన టోర్నీకి అర్హత సాధించలేకపోయారు. 23నుంచి మెయిన్ డ్రా పోటీలు జరగనున్నాయి.