Aug 18,2022 20:40

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న మాలీవుడ్‌ హీరో మమ్ముట్టి లిస్టులోకి మరో సినిమా చేరింది. బి.ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి తాజాగా 'క్రిస్టోఫర్‌' అనే టైటిల్‌ ఖరారు చేశారు. మేన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ట్యాగ్‌లైన్‌. ఆర్డీ ఇల్యూమినేషన్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఉన్నికృష్ణన్‌ నిర్మిస్తున్నారు. అమలాపాల్‌, స్నేహ, ఐశ్వర్యా లక్ష్మి, వినయ్ రాయ్, షైన్‌ టామ్‌ చాకో, దిలీష్‌ పోత్తన్‌, జిను జోసెఫ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  జెస్టిన్‌ వర్గీస్‌ సంగీతం అందిస్తున్నారు. మమ్ముట్టి ఈ చిత్రంలో మరోసారి పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. గత నెలలో ప్రకటించిన ఈ సినిమాను అతి త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్ళబోతున్నారు.