Nov 25,2022 16:41

తెలంగాణ : కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన మర్రి శశిధర్‌ రెడ్డి బిజెపి కండువా కప్పుకున్నారు. తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బిజెపి మాత్రమే పోరాడుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయిందన్నారు. మర్రి శశిధర్‌ రెడ్డి జాయినింగ్‌ కార్యక్రమంలో బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, ఈటల, డీకే అరుణ, ఎంపీ అరవింద్‌, కొండా విశ్వేశ్వర రెడ్డి, వివేక్‌లు పాల్గొన్నారు.