
హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్‌కు, డాక్టర్ పద్మజా వినరు కుమార్తె అయిన ఐశ్వర్యతో.. నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగింది. బ్రహ్మానందం ఇంటికి కాబోయే కోడలు ఐశ్వర్య కూడా డాక్టరే కావడం విశేషం. ఈ నిశ్చితార్థ వేడుకకు హాస్యనటులు ఆలీ, రఘుబాబుతోపాటు, టి. సుబ్బిరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
కాగా, బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆశించిన స్థాయిలో గౌతమ్ మూవీలు హిట్ కొట్టలేదు. ఇక రెండో కుమారుడు సిద్ధార్థ్ విదేశాల్లో చదువుకుని.. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. సిద్ధార్థ్- ఐశ్వర్యల వివాహం త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సినీవర్గాల సమాచారం.