Mar 27,2023 20:56
  • ఇంధన వినియోగదారులకు రివార్డ్స్‌

న్యూఢిల్లీ : దిగ్గజ చమురు రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఒసి)తో మారుతి సుజుకి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగసామ్యంలో మారుతి వినియోగదారులకు అదనపు రివార్డ్స్‌ ప్రయోజనాలు, సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఇండియన్‌ ఆయిల్‌ తన సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొంది. ఐఒసిఎల్‌ చొరవతో ఏప్రిల్‌ 1 నుంచి మారుతి సుజుకి రివార్డ్స్‌ యాప్‌లో పలు రివార్డ్స్‌ను పొందడానికి వీలుంది. ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ల్లో ప్రతీ రూ.100కి రెండు ఎక్స్‌ట్రా రివార్డ్స్‌ పాయింట్లలో పాటుగా ఆన్‌బోర్డింగ్‌ బోనస్‌గా 100 ఎక్స్‌ట్రా రివార్డ్స్‌ను పొందవచ్చని పేర్కొంది. మూడు మాసాల్లో రూ.25,000 ఖర్చు చేసే వినియోగదారులకు అదనంగా రూ.105 విలువ చేసే 350 ఎక్స్‌ట్రా రివార్డ్స్‌ పాయింట్లను ఇవ్వనున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి. ఈ ప్రోగ్రామ్‌లో వినియోగదారులకు అదనపు ఫీచర్లు, ప్రయోజనాలు సమకూరడంతో పాటుగా వారితో తమ కంపెనీకి బలమైన బందాన్ని ఏర్పర్చుకోవడానికి దోహదం చేయనుందని మారుతి సుజుకి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. మారుతి సుజుకితో ఈ భాగస్వామ్యం వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాలను అందించడానికి దోహదం చేయనుందని ఐఒసిఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సౌమిత్ర శ్రీవాస్తవ తెలిపారు