Nov 29,2022 17:49

అమరావతి: ఎపిలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.ఈ నేపధ్యంలో ప్రస్తుతం సీఎంఓ స్పెషల్‌ సీఎస్‌గా బాధ్యతలు చేపడుతున్న కెఎస్‌ జవహర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కొద్ది సేపటికే ఐఏఎస్‌ల బదిలీలపై ఉత్తర్వులు ఇచ్చింది. సీఎంఓ స్పెషల్‌ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌గాగా మధుసూదన రెడ్డిలను నియమించింది. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్‌ ప్రకాష్‌, ఆర్‌ అండ్‌ బి సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనరుగా రాహుల్‌ పాండే, హౌసింగ్‌ స్పెషల్‌ సెక్రటరీగా మహ్మద్‌ దివాన్లను బదిలీ చేసింది.