
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా సముద్రాన్ని శుభ్రం చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సినీ ఇండిస్టీలో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల హీరోలతో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు పరిణితి చోప్రా. ఆమెకు సినిమాలతోపాటు, పర్యావరణంపైనా మక్కువ ఎక్కువ. నేచర్ బాగుండే ప్రదేశాల్లో ఎక్కువగా హాలిడే ట్రిప్స్‌ను ఎంజాయ్ చేయడానికి వెళుతుంది. తాజాగా ఆమె హాలిడ్ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వెళ్లి..స్కూబా డైవింగ్ చేసి.. సముద్రంలోని చెత్తాచెదారాన్ని తీసేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలాగే.. 'సరదాగా డైవింగ్ చేశాను. చెత్తను సేకరించి ఓ మంచి పని చేయగలిగా. సముద్రాన్ని క్లీన్ చేయడానికి మీరు నాతో చేరండి' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పరిణితి చేసిన మంచి పనికి ప్రశంసిస్తున్నారు.