Jun 24,2022 11:47

ప్రజాశక్తి-అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. దీనిలో భాగంగా మూడో విడత 'జగనన్న అమ్మ ఒడి' పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. ఈనెల 27వ తేదీన అమ్మ ఒడి నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. జులైలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.