
ఢిల్లీ: నేటి నుంచి కొత్త భవనంలోనే పార్లమెంట్ సమావేశాలు నడుస్తాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తొలి రోజు సమావేశాలు జరగ్గా.. ముగించే ముందర ఆయన ఈ విషయం సభ్యులకు తెలియజేశారు. సభని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా.. రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు నడుస్తాయని తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనంలో ఉదయం గణపతి పూజ జరుగుతుందని సమాచారం. ఆపై మధ్యాహ్నాం 1.15 నిమిషాలకు లోక్‌సభ ప్రారంభం కానుంది. మరోవైపు రాజ్యభస 2.15 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.