Jul 03,2022 08:44

పిచ్చి పలు రకాలు అని విన్నాం కానీ.. ఇది భిన్నం. చెట్టును వివాహం చేసుకోవడం చూశాం కానీ.. క్రూర జంతువులను పెళ్లి చేసుకోవడం గురించి చూశామా.. ఇది అలాంటదే. ఓ మేయర్‌ మొసలిని వివాహం చేసుకున్నారు. అది కూడా సంప్రదాయ పద్ధతుల్లో. ఇంతకు ఎక్కడ అనుకుంటున్నారా.. ఇది జరిగింది మెక్సికోలో. ఓక్సాకా అనే మత్స్యకార గ్రామానికి చెందిన విక్టర్‌ హ్యుగో సోసా.. ఏడేళ్ల మొసలిని గత గురువారం పాత సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కుమార్తె అయిన మొసలిని తెల్లని వస్త్రాలు ధరించి.. అందంగా ముస్తాబు చేశారు. ఈ వివాహ వేడుకల్లో భాగంగా ఆ మొసలిని ఆ మేయర్‌ ముద్దాడటం విశేషం. ఈ పెళ్లికి బంధువులు, స్నేహితులు అందరూ తరలివచ్చారు. అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలో ఆటలు, పాటలతో వచ్చిన వారంతా ఎంజారు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతుంది.

 <