
ప్రజాశక్తి-అన్నవరం (కాకినాడ) : అన్నవరం దేవస్థానం కొండపైకి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుటుంబ సమేతంగా శుక్రవారం విచ్చేశారు ఈ సందర్భంగా మంత్రి ధర్మానను ఆలయ అధికారులు పూర్ణకుంభం లాంఛనాలతో స్వాగతించారు. స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రికి వేద ఆశీస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మానకు దేవస్థానం చైర్మన్ ఐవి.రోహిత్ స్వామి వారి జ్ఞాపికను అందజేశారు, మంత్రి వెంట దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబు, పి.ఆర్. ఓ కృష్ణారావు, లక్ష్మీనారాయణ, వైసిపి నాయకులు మాజీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు జమీలు బండారు ముత్యాలరావు, తదితరులు ఉన్నారు