Aug 18,2022 20:19

ముంబయి :  మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా రెండు కొత్త ఫండ్స్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. వీటిని మిరే అసెట్‌ గ్లోబల్‌ ఎలక్ట్రిక్‌, అటానమస్‌ వెహికిల్స్‌ ఇటిఎఫ్స్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ల పేరుతో ఆవిష్కరించింది. దేశంలోని మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో భవిష్యత్‌ సాంకేతికతతో ప్రమేయం ఉన్న కంపెనీల ఆధారితమైన ఇటువంటి ఫండ్స్‌ను ప్రారంభించడం ఇదే మొదటిసారని ఆ సంస్థ తెలిపింది. రెండు ఎన్‌ఎఫ్‌ఓల సబ్‌స్క్రిప్షన్‌ ఆగస్టు 16న ప్రారంభమై 30న ముగుస్తాయని తెలిపింది. ఈ పథకాల్లో కనీస ప్రారంభ పెట్టుబడి రూ.5,000గా నిర్ణయించినట్లు పేర్కొంది.