
విజయవాడ : సోని ఇండియా తమ విజయవాడలోని అల్పా కస్టమర్ సర్వీసింగ్ సెంటర్‌ను ఆధునీకరించినట్లు తెలిపింది. టీచర్స్ కాలనీలోని ఈ సెంటర్‌లో కొత్తగా కెమెరాలు, లెన్స్ రిపేర్ సేవలను జోడించినట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా 20నగరాల్లో లెన్స్, కెమెరా సర్వీసింగ్ సేవలను అందిస్తున్నామని, అందులో విజయవాడ ఒక్కటని సోని ఇండియా కస్టమర్ సర్వీస్ సెంటర్ నేషనల్ హెడ్ విశాల్ మథూర్ పేర్కొన్నారు.