Sep 18,2023 17:10
  •  తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రధాని మోడీ దెబ్బతీస్తున్నారన్నారు. అదే సమయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకోలేదనడం సరికాదని, ఇది అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ట్వీట్‌ చేశారు. మోడీ తెలంగాణ విరోధి అంటూ ట్వీట్‌ను ప్రారంభించారు. అంతకుముందు, కాంగ్రెస్‌ అర్ధ శతాబ్ధపు పాలన మోసం.. వంచన.. ద్రోహం.. దోఖాలమయం.. అంటూ విమర్శలతో ట్వీట్‌ చేశారు. పూర్తి ట్వీట్‌ చూడండి..