
న్యూఢిల్లీ : భారత్, నేపాల్‌ల మధ్య సంబంధాల ను హిమాలయాలంతా ఉన్నతంగా తీసుకెళ్లేందుకు కషి చేస్తూనే ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సరిహద్దు సమస్యలతోసహా అనేక అంశాల పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు. భారత పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ 'ప్రచండ' తో గురువారం ప్రధాని మోదీ చర్చలు జరిపారు. వాణిజ్యం, రవాణా, పెట్టుబడులు, విద్యుత్, నీటిపారుదల, పెట్రోలియం పైపులైన్ విస్తరణ, అనుసంధానత వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పటిష్ఠం చేసుకునే మార్గాలపై చర్చించినట్లు ఇరు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా రవాణా, పెట్రోలియం పైపులైన్ విస్తరణ, సమీకత చెక్‌పోస్టుల అభివద్ధి, జలవిద్యుత్ తదితర రంగాల్లో ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత్‌లోని రూపయిడిహా, నేపాల్‌లోని నేపాల్‌గంజ్‌లో సమీకత చెక్‌పోస్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. బిహార్‌లోని బథ్‌నాహా నుంచి నేపాల్ కస్టమ్ యార్డ్ వరకు ఓ సరకు రవాణా రైలుకు పచ్చజెండా ఊపారు.
రామాయణ సర్క్యూట్‌కు సంబంధించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. భారత్ అవలంబిస్తోన్న 'పొరుగు దేశానికి తొలి ప్రాధాన్యం' విధానాన్ని ప్రచండ ఈ సందర్భంగా కొనియాడారు. నాలుగు రోజుల పర్యటన కోసం బుధవారం భారత్‌కు ప్రపంచడ చేరుకున్నారు.