Aug 09,2022 08:13

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మొహర్రం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి వేర్వేరుగా సోమవారం సందేశం ఇచ్చారు. మంచితనం, త్యాగం స్మరణే 'మొహర్రం'కు నిజమైన అర్థమని గవర్నరు విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. మొహర్రం మానవాళి అన్ని ధర్మాలకూ మిన్నగా త్యాగస్ఫూర్తిని సూచిస్తుందన్నారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ప్రకటనలో తెలిపారు.
పివి సింధు, సాత్విక్‌ సాయిరాజ్‌కు అభినందనలు
2023 కామన్‌వెల్త్‌ క్రీడల్లో మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్లో విజేతగా నిలిచిన పివి సింధు, బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ ఈవెంట్‌లో చిరాజ్‌శెట్టితో కలిసి బంగారుపతకం సాధించిన సాత్విక్‌ సాయిరాజ్‌ను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. పురుషుల విభాగంలో క్యాంస పతకం సాధించిన కిడాంబి శ్రీకాంత్‌కు జగన్‌ అభినందించారు. భారత బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.