
ప్రజాశక్తి - పోలవరం : మట్టి రాతి నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర బృందం మంగళవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. పోలవరానికి చేరుకున్న బృందం (సిఎస్‌ఎంఆర్‌ఎస్) తొలుత గత వరదలకు దెబ్బతిన్న దిగువ కాపర్ డ్యామ్ ప్రాంతానికి చేరుకుంది. ఇరువైపులా పలుచోట్ల రాతి నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించింది. ఈ బృందం ఫిబ్రవరి మూడో తేదీ వరకు ప్రాజెక్టులోని గ్యాప్-1, 2, 3ల్లో నిర్మించిన కాంక్రీట్ గోడలను, స్పిల్‌వే అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్‌లో రాతి నాణ్యతను పరిశీలించనుంది.ఒకటిన్నర మీటర్ల వ్యాసార్థం కలిగిన రింగ్ పరిధిలో 0.8 మీటర్ల దిగువున రాతి నాణ్యతను తూకం నిర్వహించి సామర్థ్యాన్ని అంచనా వేస్తారని బృందం సభ్యులు తెలిపారు. ఈ బృందంలో సిఎస్‌ఎంఆర్‌ఎస్ శాస్త్రవేత్త ఉదరుభాను చక్రవర్తి, ల్యాబ్ అసిస్టెంట్ రాజేశ్వర్‌సింగ్, మరో ఇద్దరు సభ్యులు ఉన్నారు.