Jun 24,2022 08:21

ప్రజాశక్తి - విజయవాడ : విజయవాడ కృష్ణలంక బాలాజీనగర్‌లో తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. కృష్ణలంక పోలీసుల కథనం ప్రకారం... బాలాజీనగర్‌కు చెందిన గోపాలకష్ణ లారీ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. భర్తతోపాటు తన తల్లిదండ్రులు కూడా పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెంది చలమలశెట్టి చంద్రలక్ష్మి (27) అనే మహిళ సూసైడ్‌ నోట్‌ రాసి తన ఇద్దరు పిల్లలు నాగమణికంఠ (8), జయహర్ష (7)లకు ఉరివేసి తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురూ బుధవారం ఇంట్లో మతి చెందగా, గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో విషయం వెలుగుచూసింది. ఎస్‌ఐ అనూష కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కూడా చంద్రలక్ష్మి ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు.