Nov 25,2022 13:22

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నవంబర్‌ 25 అంతర్జాతీయ హింసా వ్యతిరేక దినం, డిసెంబర్‌ 10 మానవహక్కుల దినోత్సవాలను పురస్కరించుకొని ఐద్వా ఆధ్వర్యంలో సదస్సులు. ర్యాలీలు నిర్వహించాలని ఐద్వా ఆలిండియా పిలుపునిచ్చింది. శుక్రవారం నగరంలోని 45వ వార్డు ఎల్‌బిజి నగర్‌లో జి.పుణ్యవతి అధ్యక్షతన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఐద్వా జిల్లా కార్యదర్శి. పి.రమణమ్మ మాట్లాడుతూ... రోజురోజుకీ మహిళలపై రకరకాల రూపల్లో దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రోజుకు 86 అత్యాచారాలు జరుగుతున్నాయని, సగటున గంటకి 49 నేరాలు మహిళలపై జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి 77 నిముషాలకు ఒక వరకట్న హత్య జరుగుతుందన్నారు. ప్రతి 48 నిముషాలకు ఒక దళిత మహిళ అత్యాచారానికి గురవుతుందని చెప్పారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళుపూర్తి చేసుకున్నా ఇప్పటికీ ఆడపిల్లలకు సరైన విద్య లేదని, ఉద్యోగాలు లేవని, ఉపాధి లేదని, శ్రామిక మహిళలకు సమానపనికి సమాన వేతనం లేదని అన్నారు. ఈ ప్రభుత్వాలు 33 శాతం రిజర్వేషన్లు బిల్లులు అమలు చేయడంలేదని చెప్పారు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు, మరోవైపు మద్యం, డ్రగ్స్‌, గంజాయి, మాదకద్రవ్యాల ప్రభావం వల్ల యువత పక్కదారి పడుతుందని, వీటిని ఐద్వా జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని స్పష్టం చేశారు. హింసను అరికట్టడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. స్త్రీని సరుకుగా మార్కెట్‌ చూస్తుందని, ఈ దఅక్పథం మారేందుకు ప్రభుత్వాలు తగిన విధంగా కఅషి చేయాలని డిమాండ్‌ చేశారు. హింస లేని సమాజం కోసం మహిళా లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహిళ రక్షణ కోసం ఐద్వా నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐద్వా నాయకులు కుమారి, కఅష్ణమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.