Aug 19,2022 13:18

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సెప్టెంబర్‌ 27న విజయనగరం గురజాడ కళా భారతిలో జిల్లా బాడీ బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మిస్టర్‌ విజయనగరం బాడీ బిల్డింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు రెడ్డి శంకరరావు, జిల్లా కార్యదర్శి కోరాడ శ్రీనివాస రావులు తెలిపారు. శుక్రవారం విజయనగరం బాడి ఫిట్నెస్‌ జిమ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మిస్టర్‌ విజయనగరం 22లో 8 కేటగిరీలు ఉంటాయని తెలిపారు. ప్రతి కేట గిరీకి మొదటి, రెండు ప్రైజ్‌లు, అవార్డ్‌ అందజేస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టీ షర్ట్‌లు అందజేస్తామన్నారు. పార్వతి పురం మన్యం, విజయనగరం జిల్లాలు కలిపి బాడి బిల్డర్స్‌ పాల్గొనవచ్చని తెలిపారు. సమావేశంలో జిల్లా కమిటి నాయకుల. డి. సన్నిబాబు, బైక్‌.రమేష్‌, డి.శ్రీను, నమ్మి ప్రసాద్‌లు పాల్గొన్నారు.