
- చంద్రబాబుకు పూర్తి స్థాయి భద్రత
ప్రజాశక్తి-రాజమండ్రి : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన భద్రత, ములాఖత్ విషయంలో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా సందర్భంగా జైళ్ల శాఖ డీఐజీ స్పందించారు. మాజీ ముఖ్యమంత్రికి పూర్తిస్థాయి భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఆయనకు నిబంధనల ప్రకారం సౌకర్యాలు ఉన్నాయని, కోర్టు గైడెన్స్ ప్రకారం ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు ఉంటాయన్నారు. ములాఖత్ వ్యవహారంలో నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. చంద్రబాబును కలిసేందుకు వారానికి రెండు ములాఖత్‌లు మాత్రమే ఉంటాయని చెప్పారు. అత్యవసరమైతే అధికారుల నిర్ణయంతో మూడో ములాఖత్ ఉంటుందని రవికిరణ్ పేర్కొన్నారు.