Oct 03,2022 22:48

గురుగ్రామ్‌ : ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు ములయాం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం ఐసియు నుంచి క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (సిసియు)కు తరలించారు. గుర్రుగ్రామ్‌లోని మెదాంత హస్పటల్‌లోని ములయాం సింగ్‌ ఆగస్టు 22 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం ఆరోగ్యం క్షీణించడంతో ఐసియులో చేర్చారు. సోమవారం సిసియుకు తరలించారు. కాగా, ములాయం ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అతని కుటుంబసభ్యుల్ని ఫోన్‌ ద్వారా ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించడానికి కేంద్రం తరుపున అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

  • ములాయం ఆరోగ్య పరిస్థితిపై అఖిలేశ్‌కు కెసిఆర్‌ ఫోన్‌

అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎంపి ములాయంసింగ్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆరా తీశారు. ములాయం కుమారుడు, ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌కు సోమవారం ఫోన్‌ చేసిన కెసిఆర్‌... ములాయం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దసరా తర్వాత తాను స్వయంగా వచ్చి కలుస్తానని తెలిపారు.