May 31,2023 15:11

బెంగళూరు : పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పిఎఫ్‌ఐ) అనే నిషేధిత ముస్లిం రాజకీయ సంస్థకు చెందిన కార్యకర్తల ఇళ్లపై ఎన్‌ఐఎ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. పిఎఫ్‌ఐ కార్యకర్తల ఇళ్లు, ఆఫీసు కార్యాలయాలు, ఆసుపత్రులపై ఏకకాలంలో మంగళూరుతోపాటు, పుత్తూరు, బెల్తంగడి, ఉప్పినంగడి, వేణూరు, బంట్వాళా వంటి 16 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఎన్‌ఐఎ అధికారులు వెల్లడించారు.
కాగా, 2022 జులై 12న బీహార్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీపై దాడి చేసేందుకు పిఎఫ్‌ఐ కుట్ర పన్నింది. ఈ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఎ దాడులు నిర్వహించినట్లు అధకారులు తెలిపారు. ఇక పిఎఫ్‌ఐ సంస్థ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందనే కారణంతో యుఎపిఎ చట్టం కింద సెప్టెంబర్‌ 28-2022న ఈ సంస్థపై భారత హోంమంత్రిత్వశాఖ ఐదు సంవత్సరాలపాటు నిషేధించింది.