May 28,2023 13:12

ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్‌ కోనసీమ) : నేడు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ... మండల కేంద్రంలో ఆదివారం జిల్లా టిడిపి అధికార ప్రతినిధి ఈదల సత్తిబాబు, లీగల్‌ సెల్‌ అధికార ప్రతినిధి కప్పల సునీల్‌ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులతో కలిసి ప్రజలకు సందేశాన్ని ఇస్తూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ... తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించేలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేంతవరకు మా శ్రమ ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి దళిత నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.