Nov 20,2022 11:21

బెంగళూరు : టాలివుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య పెళ్లి ఆదివారం ఉదయం 11 గంటల 25 నిమిషాలకు బెంగళూరులోని ఓ ఫైవ్‌ స్టార్‌ హౌటల్‌లో ఘనంగా జరిగింది. బంధువులు, అత్యంత సన్నిహితుల మధ్య బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టితో నాగశౌర్య వివాహ వేడక వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై పలువురు స్పందిస్తూ నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు. పెళ్లి ఫోటోలను చూసి నాగశౌర్య- అనూష జోడీ చాలా బాగుందని కామెంట్స్‌ పెడుతున్నారు. పెళ్లి వేడుకలో భాగంగా నిన్న వీరి హల్దీ సెలబ్రేషన్‌ కలర్‌ ఫుల్‌ గా జరిగింది. అనంతరం కాక్‌ టెయిల్‌ పార్టీ జరిగింది.

టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు నాగశౌర్య వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పలువురు సెలబ్రిటీలు సహా అభిమానుల నుంచి కొత్తజంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అనూష శెట్టి ఇంటీరియర్‌ డిజైనర్‌గా పలు అవార్డులను అందుకున్నారు. కొన్నాళ్లుగా ఆమెకు నాగశౌర్యతో పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

 

Nagashauryas-wedding-photos

 

Nagashauryas-wedding-photos

 

Nagashauryas-wedding-photos

 

Nagashauryas-wedding-photos