Oct 05,2022 13:40

హైదరాబాద్‌ : మాజీ ఎమ్మెల్యే నల్లాల దంపతులు తిరిగి టిఆర్‌ఎస్‌లోకి చేరారు. కొద్దిరోజుల కిందట ఓదెలు తన భార్య, మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్మన్‌ భాగ్యలక్ష్మితో కలిసి టిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా ఆయన మంత్రి కెటిఆర్‌ సమక్షంలో తిరిగి టిఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌ వారికి గులాబీ కండువా కప్పి టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. 2009, 2014 లో టిఆర్‌ఎస్‌ తరపున చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా నల్లాల ఓదెలు గెలుపొందారు.