Nov 23,2022 18:32

దుబాయ్ : కొచ్చి వేదికగా డిసెంబర్‌ 23న జరుగనున్న మినీ వేలంలో పాల్గొనాలకున్న ఆటగాళ్లకు బీసీసీఐ డెడ్‌లైన్‌ విధించింది. వేలం బరిలో ఉండాలనుకే ఆటగాళ్లు డిసెంబర్‌ 15లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 15 సాయంత్రం 5 గంటలలోగా ఆటగాళ్లు తమ పేర్లను ఎన్‌రోల్‌ చేసుకోకపోతే, మినీ వేలానికి వారు అనర్హులని ప్రకటించింది. 10 ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్లతో కలుపుకునే మొత్తం 250 మంది వరకు వేలంలో పాల్గొనవచ్చని బీసీసీఐ అంచనా వేస్తుంది.


ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్‌లో

  • ముంబై ఇండియన్స్‌-20.55 కోట్లు
  • చెన్నై సూపర్‌కింగ్స్‌-20.45కోట్లు
  • ఢిల్లీ క్యాపిటల్స్‌-19.45 కోట్లు
  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-8.75 కోట్లు
  • కోల్‌కతా నైట్‌రైడర్స్‌-7.05 కోట్లు
  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 42.25 కోట్లు
  • పంజాబ్‌ కింగ్స్‌-32.20 కోట్లు
  • లక్నో సూపర్‌ జెయింట్స్‌-23.35 కోట్లు
  • గుజరాత్‌ టైటాన్స్‌-19.25 కోట్లు
  • రాజస్థాన్‌ రాయల్స్‌-13.20 కోట్లు