Nov 25,2022 15:23

హైదరాబాద్‌: జనవరి 27 నుంచి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తన పాదయాత్ర కొనసాగిస్తానని అధికారికంగా ప్రకటించారు. మంగళగిరి నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు కొనసాగుతుందని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో 4 రోజులు పాదయాత్ర ఉంటుందని.. మిగిలిన రోజుల్లో రాష్ట్రమంతా పాదయాత్ర చేయనున్నట్లు లోకేశ్‌ వెల్లడించారు. తనని ఓడించేందుకు సీఎం జగన్‌ వాడే అన్ని ఆయుధాలను దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మంగళగిరిని కాపు కాసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు లోకేశ్‌ సూచించారు.