Jan 24,2023 20:14
  • ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేషన్‌

సినీరంగంలో అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డ్‌ నామినేషన్స్‌ విడుదలయ్యాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన టాలీవుడ్‌ సంచలన మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం నుంచి 'నాటు నాటు సాంగ్‌' ఎంపికైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి నామినేషన్‌ దక్కింది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం ట్వీట్‌ చేసింది. 'సరికొత్త చరిత్ర సృష్టించాం' అంటూ పోస్ట్‌ చేసింది. ఒ

Natu-Natu-song-in-the-Oscar-ring

రిజనల్‌ సాంగ్‌ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సాంగ్‌ నామినేట్‌ అయింది. తాజాగా ఈ జాబితాను ఆస్కార్‌ నామినేషన్స్‌ కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది 95వ ఆస్కార్‌ నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 13న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలకు స్థానం దక్కించుకున్నాయి. షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌, ఆల్‌ దట్‌ బ్రీత్స్‌ ఎంపికయ్యాయి.
ఆర్‌ఆర్‌ఆర్‌ లోని నాటు నాటు పాటకు కీరవాణి బాణీలు అందించగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ఈ పాటకు ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ చేశాడు.