
హెంగెలో(నెదర్లాండ్స్): ఎఫ్‌బికె గేమ్స్‌కు భారత యువ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దూరమయ్యాడు. శిక్షణ సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీరజ్ చోప్రా సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. 'కండరాల నొప్పితో బాధపడుతున్నా.. వైద్యబృందం సూచన మేరకు ఎఫ్‌బికే గేమ్స్‌నుంచి వైదొలుగుతున్నా.. ఈ టోర్నీ విజయవ్తంం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని నీరజ్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇక హెంగెలోలోని ఫ్యాన్సీ బ్లాంకర్స్-కోయెన్ స్టేడియంలో జూన్ 4 నుంచి ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు జరగనున్నాయి.