Mar 21,2023 20:31

న్యూఢిల్లీ : మహిళల వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఇండియన్‌ మహిళా బాక్సర్‌ నీతూ ఘంగాస్‌(Nitu Ghangas)... వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. 45-48 కేజీల విభాగంలో ఆమె ఇవాళ జరిగిన బౌట్‌లో విక్టరీ కొట్టింది. ప్రి క్వార్టర్స్‌లో నీతూ కేవలం 128 సెకన్లలోనే బౌట్‌ను గెలిచేసింది. ఆమె పంచ్‌లకు తజకిస్తాన్‌ బాక్సర్‌ సుమయ్య హడలెత్తిపోయింది. 75కిలోల ప్రిక్వార్టర్స్‌ బౌట్‌లో లవ్లీనా 5-0 తేడాతో మెక్సికో బాక్సర్‌ వెనెస్సా ఒర్టిజ్‌పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన ఈ అస్సాం బాక్సర్‌ ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా పవర్‌ఫుల్‌ పంచ్‌లతో విరుచుకుపడింది. మరోవైపు 54 కిలోల విభాగంలో సాక్షి ..జజిరా ఉర్కబయేవా(కజకిస్థాన్‌)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. అనూహ్య రీతిలో జట్టులో చోటు దక్కించుకున్న ప్రీతి(54కి) 3-4 తేడాతోజింట్‌పాంగ్‌ జుటామస్‌(థారులాండ్‌) చేతిలో పోరాడి ఓడింది.