Nov 23,2022 20:50

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి సరికొత్త ఈకో వాహనాన్ని ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇది శక్తివంతమైందని, ఇంధనాన్ని మరింతగా పొదుపు చేయగలదని ఆ కంపెనీ పేర్కొంది. పెట్రోల్‌ వర్షన్‌లో లీటర్‌కు 20.20 కిలోమీటర్ల మైలేజీ, సిఎన్‌జిలో 27.05 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుందని తెలిపింది. ఆరు వేరియంట్లలో ఆవిష్కరించిన దీని ప్రారంభ ధర శ్రేణీని రూ.5.10 లక్షల నుంచి రూ.5.46 లక్షలుగా నిర్ణయించింది.