Mar 18,2023 10:54

వెల్లింగ్టన్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో రోజు ఆటలొ న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌ (215), హెన్రీ నికోల్స్‌ (200 నాటౌట్‌) ద్విశతకాలు సాధించారు. దీంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 580 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. డెవాన్‌ కాన్వే (78) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. టామ్‌ లాథమ్‌ (21), డారిల్‌ మిచెల్‌ (17) తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో కసున్‌ రజిత 2, ధనంజయ డిసిల్వ, ప్రభాత్‌ జయసూర్య తలో వికెట్‌ పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక 17 ఓవర్లలో 2 నష్టాపోయి 26 పరుగులు చేసింది. 6 పరుగులు చేసిన ఓషద ఫెర్నాండో మాట్‌ హెన్రీ బౌలింగ్‌లో టామ్‌ బ్లండెల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ కుశాల్‌ మెండిస్‌ బ్రాస్‌వెల్‌ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి డక్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో కరుణరత్నే(16), ప్రబాత్ జయసూర్య (2) ఉన్నారు.