
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌లో నవ వధువు కిడ్నాప్ కలకలం రేపింది. ఓ జంట జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో ప్రేమ వివాహం చేసుకుని తిరిగి వెళ్తుండగా కొందరు వ్యక్తులు నవ వధువును కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌గురైన నవ వధువు హనుమకొండ జిల్లా మడికొండ గ్రామం కాగా.. వరుడు స్వస్థలం వరంగల్. అయితే వీరు ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తుండగా.. కారులో వచ్చిన కొంత మంది హుజురాబాద్ అంబేడ్కర్ విగ్రహం వారిని అడ్డుకున్నారు. అనంతరం వరుడిపై దాడి చేసి వధువను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.