Mar 27,2023 20:47

హైదరాబాద్‌ : ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ప్రస్తుత వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా నూతన శ్రేణీ మజ్జిగ ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఎ-వన్‌ బ్రాండ్‌ పేరుతో వీటిని ఆవిష్కరించినట్లు పేర్కొంది. అదే విధంగా అతి సులభంగా అందించేలా నూతన శ్రేణీ మిల్క్‌ షేక్స్‌ను కార్టన్‌ బాక్స్‌లలో విడుదల చేసినట్లు తెలిపింది. హెరిటేజ్‌ 'ఎ-వన్‌' స్పెషల్‌ బటర్‌మిల్క్‌ అతి తక్కువ కేలరీ నేచురల్‌ రిఫ్రెషనర్‌ అని పేర్కొంది. అల్లం, పచ్చిమిరపలతో పాటుగా ఉప్పు, పులుపులను మిళితం చేసిన 180 మిల్లీ లీటర్ల ప్యాక్‌ను రూ.20కే అందిస్తున్నట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ తెలిపింది. నూతన శ్రేణి మిల్క్‌షేక్‌లలో వెనీలా, స్ట్రాబెర్రీ వంటి ప్రాచుర్యం పొందిన వేరియంట్లతో ఆవిష్కరించింది. ఈ మిల్క్‌షేక్‌లు 180 మిల్లీలీటర్ల ప్యాక్‌ రూ.40, 125 మిల్లీ లీటర్‌ రూ.15 లభ్యం కానున్నాయని ఆసంస్థ వైస్‌ ఛైర్‌పర్సన్‌, ఎండి భువనేశ్వరి నారా తెలిపారు. ''బాదమ్‌ చార్జర్‌ను ఇతర రుచుల మిల్క్‌ ప్రొడక్ట్స్‌తో పోలిస్తే 30 శాతం తక్కువ షుగర్‌తో అందించడంతో పాటుగా కృత్రిమ రంగులు కూడా జోడించలేదు. సహజసిద్ధమైన బాదములను దీనిలో జోడించాము'' అని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రహ్మణి నారా తెలిపారు.