Jun 21,2022 21:19

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 25 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను మహిళా కాలేజీలుగా మార్చొద్దని, నూతన కళాశాలలు ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్‌, ఎ.అశోక్‌ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబుకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. కొత్త కళాశాలలు ఏర్పాటు చేయాల్సింది పోయి ఉన్న కళాశాలలను మార్చడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం మార్చాలనుకుంటున్న కళాశాలలకు దశాబ్దాల చరిత్ర ఉందని వివరించారు. ఈ ఏడాది విద్యార్థులు ఎక్కువమంది చేరారని, వెంటనే ఇంటర్మీడియట్‌ బోర్డు ఇచ్చిన జిఓ 85ను రద్దు చేయాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి రెండు రోజుల్లో జిఓను మార్పు చేసి యథావిధిగా కొనసాగిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమేశ్వరరావు, వెంకటేశ్వరరావు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.