
న్యూఢిల్లీ : ఈ నెల 20 నుంచి భారత్‌లో నోకియా ఎక్స్30 5జీ అమ్మకం ప్రారంభమవుతుంది. మిడ్-బడ్జెట్ ఫోన్‌గా కస్టమర్ల ముందుకొస్తున్న నోకియా ఎక్స్30 5జీ ఓఐఎస్ ఆధారిత 50 ఎంపీ కెమెరాతో ఆకట్టుకోనుంది. నోకియా ఎక్స్30 మూడేళ్ల వరకూ మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.
భారత్‌లో నోకియా ఎక్స్30 5జీ ధర రూ. 35,000గా ఉండే అవకాశం ఉంది. నోకియా ఎక్స్30 5జీ యూనిబాడీ డిజైన్‌తో బ్లూ, వైట్ కలర్స్‌లో కస్టమర్ల ముందుకురానుంది. లేటెస్ట్ నోకియా ఫోన్ 6.43 ఇంచ్ ఫుల్‌హెచ్‌డీం డిస్‌ప్లేతో, హైఎండ్ స్మార్ట్‌ఫోన్లలో ఉండే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో రానుంది.
నోకియా ఎక్స్30 5జీ స్మార్ట్‌ఫోన్ బాడీ నూరుశాతం రీసైకఇల్డ్ అల్యూమినియం, 65 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారైందని కంపెనీ పేర్కొంది. ఎక్స్30 వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉంటాయి. కెమెరా సెటప్‌లో ఓఐఎస్‌తో కూడిన 50ఎంపీ కెమెరా, 123 డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 13 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. నోకియా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో 33డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్‌తో 4200ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది.