Nov 24,2022 15:47

హైదరాబాద్‌: సినీ ఇండ్రస్టిలో పేరొందిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో టాలీవుడ్‌ హీరో అల్లరి నరేష్‌ సంచలన ప్రకటన చేశారు. నాంది తర్వాత అల్లరి నరేష్‌ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్‌ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో అల్లరి నరేష్‌ సరసన ఆనంది హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ సినిమా పొలిటికల్‌ బ్యాగ్‌ డ్రాప్‌ లో వస్తున్న తరుణంలో నరేష్‌ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. దీనిపై నరేష్‌ స్పందిస్తూ రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్‌ లేని సబ్జెక్ట్‌, రాజకీయాల్లోకి రానని, సున్నితంగా ఉండే నా లాంటి వాళ్ళకి రాజకీయాలు సరిపోవన్నారు.