
న్యూఢిల్లీ : ఎంఇఐటివై కామన్ సర్వీసెస్ సెంటర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఒప్పో ఇండియా తెలిపింది. దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన మహిళలకు సాధికారత కల్పించడానికి ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ మద్దతుతో ఒప్పో ఇండియా, సిఎస్సి అకాడమీ సంయుక్తగా సైబర్ సాంగిని ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు పేర్కొంది. సైబర్ సెక్యూరిటీ, సైబర్ వెల్నెస్లో 10,000 మంది మహిళలకు ఇందులో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది.