Sep 29,2022 16:26

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : పాత పెన్షన్‌ విధానం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యుటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ నాగమణి, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, యూటీఫ్‌ జిల్లా కార్యదర్శి టి.గాదిలింగప్ప డిమాండ్‌ చేశారు. గురువారం ఆదోనిలోని యుటీఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగ ఉపాద్యాయులకు ఉపయోగంలేని జీపీఎస్‌ విధానం తీసుకురావడాన్ని యుటీఎఫ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ ఆధారంగానే ఎంఈఓ, డీవైఈఓ, డైట్‌, జేఎల్‌ పదోన్నతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అన్ని యాజమాన్యంలోని ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్స్‌ వేసవి సెలవులు ముగిసేలోపు పూర్తిచేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం విచారకరమన్నారు. మున్సిపల్‌, గిరిజన ఉపాధ్యాయుల పోస్టుల అప్‌డేట్‌ చేయాలని కోరారు. మున్సిపల్‌, గిరిజన ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్స్‌ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశం లో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శకులు సుధాకర్‌, రంగన్న, యూటీఫ్‌ సీనియర్‌ నాయకులు పాపయ్య, మల్లయ్య, పెద్దయ్య, బసప్ప, రుద్రముని, నర్సయ్యగౌడ్‌, సక్కరి భాస్కర్‌, ఆవుల బసప్ప, జనార్ధన్‌, శివకుమార్‌ గౌడ్‌, లింగన్న పాల్గొన్నారు.