Aug 09,2022 21:11
  • క్విట్‌ ఇండియా 80వ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టనున్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ : కన్యాకుమారి నుండి కాశ్మీర్‌కుభారత్‌ జోడో యాత్ర (భారత్‌ ఐక్యతా ర్యాలీ)ను సెప్టెంబరు 7నుండే చేపట్టాలనికాంగ్రెస్‌ నిర్ణయించింది. క్విట్‌ ఇండియా ఉద్యమం 80వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యాత్రను అక్టోబరు 2 నుండి నిర్వహించాలని తొలుత భావించారు. ''80ఏళ్ళ క్రితం ఇదే రోజు భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకత్వంలో, మహాత్మా గాంధీ స్ఫూర్తితో క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభించబడింది. ఆ తర్వాత ఐదేళ్ళకు స్వాతంత్య్రాన్ని పొందగలిగాం. ఈ సందర్భంగా సెప్టెంబరు 7 నుండి భారత్‌ ఐక్యతా ర్యాలీని కన్యాకుమారి నుండి కాశ్మీర్‌ వరకు చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.'' అనికాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3500 కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర సాగుతుందని, 150 రోజుల్లో ఇది పూర్తవుతుందని తెలిపారు. రాహుల్‌ గాంధీతో సహా నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గనాలని కోరారు. భయం, మతోన్మాదం, బేధాభిప్రాయాలు, జీవనోపాధుల ధ్వంసం, పెరుగుతును నిరుద్యోగం, పెరుగుతున్న అసమానతలు వీటన్నింటితో కూడిన రాజకీయాలకు ప్రత్యామాుయాన్ని అందించేందుకు దేశవ్యాప్తంగా బృహత్తరమైన రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రంలో భాగస్వాములు కావాల్సిందిగా రమేష్‌ పిలుపిచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఏమిటో చెప్పాలని ఆయన ట్వీట్‌ చేశారు.