Oct 02,2022 20:40

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ :శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోని మూల విరాట్‌ను రెండో రోజు ఆదివారం సూర్య కిరణాలు తాకాయి. స్వర్ణ శోభితంగా స్వామివారి విగ్రహంపై సుమారు రెండు నిమిషాలు కిరణాలు పడ్డాయి. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివచ్చారు. ఏడాదిలో రెండుసార్లు మూల విరాట్‌ను సూర్య కిరణాలు తాకడం ఈ ఆలయ విశేషం. ఏటా అక్టోబరులో మూడు రోజుల పాటు ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుందని ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.