
అగర్తల : పార్టీ కార్యాలయాన్ని తిరిగి ప్రారంభిస్తున్న సిపిఎం నేతలపై కాషాయ గూండాలు దాడికి దిగాయి. ఈ దాడిలో ఒకరు మరణించగా, సుమారు 30 మంది కార్యకర్తలకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. సుమారు 20 మంది ఆస్పత్రిలో చేరినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటన పశ్చిమ త్రిపురలోని సెపహిజాలా జిల్లా చారిలామ్ గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. చారిలామ్ గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని తిరిగి ప్రారంభిస్తుండగా... బిజెపి గూండాలు దాడికి దిగాయని సిపిఎం ఓ ప్రకటనలో తెలిపింది. మాజీ ఆర్థిక, ప్రసారశాఖ మంత్రి భాను లాల్ షా, జిల్లా నేత ప్రదేశ్ రారులతో పాటు పలువురు నేతలకు గాయాలైనట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.