Jan 31,2023 21:22

న్యూఢిల్లీ : వాడిన ఉత్పత్తులను విక్రయించే ఆన్‌లైన్‌ వేదిక ఒఎల్‌ఎక్స్‌లో పని చేస్తున్న 1500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనున్నారు. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఆ కంపెనీ తొలగింపులకు పాల్పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో 10వేల మంది పని చేస్తుండగా.. ఇందులో 15 శాతం మందికి ఉద్వాసన పలికేందుకు ఆ సంస్థ సిద్దం అవుతోంది. ఇందులో భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఉన్నారు. ఇంజినీరింగ్‌, ఆపరేషన్స్‌ టీమ్‌లో పనిచేసే ఉద్యోగులపైనా తొలగింపులు ఉండొచ్చని రిపోర్టులు వస్తున్నాయి. కాగా.. భారత్‌లో ఎంతమందిని తొలగిస్తున్నారనేది స్పష్టత రావాల్సి ఉంది.