రుద్రంపేట పంచాయతీకి త్వరలో పిఏబీఆర్ తాగునీరు అందిస్తాం : అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం అర్బన్ నియెజకవర్గం పరిధిలోని రుద్రంపేట పంచాయతీలోని అన్ని కాలనీలకు పిఏబీఆర్ సత్యసాయ స్కీం ల ద్వారా రాబోయే ఎనిమిది నెలలో రక్షిత తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక విమలా ఫరూక్ నగర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు తమకు ఫ్లోరైడ్ నీరు వస్తుందని అందుకోసం తాము తాగునీటి కోసం ప్రైవేట్ వారు తెచ్చే మినరల్ నీటిని రూ.8 రూపాయలు పెట్టి ఓ బద్దె నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని మహిళలు ఎమ్మెల్యే దఅష్టికి తీసుకువచ్చారు. అందుకు ఎమ్మెల్యే స్పందించి రాబోయే ఎనిమిది నెలల్లో రుద్రంపేట పంచాయతీ ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మహిళలకు హామీ ఇచ్చారు. ఇందుకు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే రుద్రంపేట పంచాయతీ లో ప్రజలు మౌలిక సదుపాయాల రోడ్లు, మురుగు కాల్వలు, పాఠశాల ఆధునీకరణ, అంగన్వాడీ లు ఏర్పాటుకు కోట్ల రూపాయల ఖర్చు చేశామన్నారు. ప్రజలకు మెరుగైన జీవనం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన అని చర్యలు వైసిపి ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. ప్రజల వద్దకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువ చేశామన్నారు. ప్రజలు సంక్షేమము కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతఅత్వంలో తామంతా పనిచేస్తున్నామని రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ జగన్ ప్రభుత్వానికి ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమములో వైస్ ఎంపీపీ బాలాజీ, సర్పంచ్ సుగాలి పద్మావతి, ఉప సర్పంచ్ నరేంద్ర రెడ్డి, ఎంపీటీసీ లు, పి.ఏ.సీస్ డైరెక్టర్ గోవింద రెడ్డి, మాజీ ఎంపీపీ రంగంపేట గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ కుళ్ళాయప్ప, వైసీపీ నాయకులు కృష్ణవేణి, సాదిక్, ఓబులపతి, తిరుపతి నాయుడు, పురుషోత్తమ్, వార్డు మెంబర్లు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.