Oct 01,2022 22:36

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : టెలికాం రంగంలో నూతన విప్లవం 5జి టెక్నాలజీతో రానుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. స్థానిక ప్రగతి మైదానంలో నాలుగు రోజులపాటు జరిగే ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసి) ఆరో ఎడిషన్‌ను ప్రారంభించి, 5 జి సేవలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5జి సేవల ప్రారంభం 21వ శతాబ్ధంలో దేశానికి చరిత్రాత్మక సంఘటనగా నిలుస్తుందన్నారు. డిజిటల్‌ ఇండియా సాధించిన విజయంగా దీనిని ఆయన అభివర్ణించారు. ఈ సాంకేతికత ఆవిష్కరణతో ప్రతి ఇంటికీ ఇంటర్నేట్‌, సూతన సాంకేతిక పరిజ్ఞానం చేరగలదన్న నమ్మకం తనకుందని చెప్పారు. డిజిటల్‌ ఇండియా సంపూర్ణ లక్ష్య సాధన డిజిటల్‌ వివైస్‌ ధర, డిజిటల్‌ కనెక్టివిటీ, డిజటల్‌ డేటా ధర, డిజిటల్‌ ఫస్ట్‌ అప్రోచ్‌ అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 2014లో దేశం నుండి మొబైల్‌ ఫోన్ల ఎగుమతి జరిగేది కాదని, ఇప్పుడు వేల కోట్ల రూపాయల విలువైన మొబైల్‌ ఫోన్లను ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. దీంతో దేశంలో ఫోన్ల ధర కూడా గణనీయంగా తగ్గిందని అన్నారు. అదే విధంగా ఒకప్పుడు ఒక జిబి డేటా 300 రూపాయలు ఉండేదని, ప్రస్తుతం 10 రూపాయలకే లభిస్తోందనిచెప్పారు. భారతదేశం కేవలం టెకాులజీ వినియోగదారుగా మిగిలాలనుకోవడం లేదని, సాంకేతికత అభివృద్ధి అంశంలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇంటర్నేట్‌ వినియోగదారులు 2014లో ఆరు కోట్లు ఉండగా ఆ సంఖ్య 80 కోట్లకు చేరుకుందని చెప్పారు. 2014లో 100 కంటే తక్కువ పంచాయతీలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉండగా, ఇప్పుడు 1.7 లక్షల పంచాయతీలు ఆప్టికల్‌ ఫైబర్‌తో అనుసంధానమయ్యాయని చెప్పారు. 2జి, 3జి, 4జి టెక్నాలజీల కోసం ఇండియా ఇతర దేశాలపై ఆధారపడి ఉందని, అయితే 5జితో ఇండియా సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పారు. 5జి సాంకేతికత వేగవంతమైన ఇంటర్‌నెట్‌ యాక్సెస్‌కు మాత్రమే పరిమితం కాదని, జీవితాలను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. మొదటి మూడు పారిశ్రామిక విప్లవాల నుంచి దేశం ప్రయోజనం పొంది ఉండకపోవచ్చు, కానీ నాల్గో పారిశ్రామిక విప్లవం నుంచి దేశం పూర్తి ప్రయోజనం పొందుతుందన్నారు. వాస్తవానికి దానికి నాయకత్వం వహిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలను సందర్శించి, ఈ కొత్త సాంకేతికతకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ఆవిష్కరించాలని టెలికాం పరిశ్రమ అసోసియేషన్‌ నాయకులను ప్రధాని మోడీ కోరారు. 5జి సేవలు ప్రారంభం సువర్ణాక్షరాలతో రికార్డులకు ఎక్కుతుందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు.

  • 2023 డిసెంబరు నాటికి అన్ని ప్రాంతాల్లో : ముకేశ్‌ అంబానీ

2023 డిసెంబరు నాటికి దేశంలోనిఅనిు ప్రాంతాలకూ 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పట్టణానికి, ప్రతి తాలూకాకు జియో 5జి సర్వీసులను అందజేస్తామని చెప్పారు.

  • గ్రామీణ ప్రాంతాలకు కొత్త అవకాశాలు : సునీల్‌ భారతి మిట్టల్‌

5జి సేవలు ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి అవకాశాల సముద్రాన్ని తెరుస్తుందని భారతి ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ అన్నారు. తొలిత నాలుగు మెట్రో నగరాలతో సహా ఎనిమిది నగరాల్లో 5జి సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దశలవారీ వీటిని విస్తరిస్తామని, 2024 మార్చి నాటికి దేశమంతా 5జి అందుబాటులోకి తెస్తామని అన్నారు..

  • ఉత్తేజకరమైన ప్రయాణానికి నాంది : కుమార్‌ మంగళం బిర్లా

5జి ప్రారంభం దేశానికి ఒక ఉత్తేజకరమైన ప్రయాణానికి నాంది అని ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా అన్నారు. 5జి ఆగమనం ప్రపంచ వేదికపై దేశానికి ఒక గుర్తింపు ఇచ్చిందన్నారు.

5జీ సేవలు ప్రారంభమయ్యే నగరాలివే..
అహ్మదాబాద్‌, బెంగళూరు, చండీగఢ్‌, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్‌, గురుగ్రామ్‌, హైదరాబాద్‌, జామ్‌నగర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పుణె నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.

PM-Modi-launched-5G-services-in-the-country