
గుంటూరు : డాక్టర్స్ డే సందర్భంగా ప్రజాశక్తి దినపత్రిక ఆధ్వర్యంలో గుంటూరులోని నరసరావుపేట వెంగళరెడ్డి నగర్ ప్రజాశక్తి కార్యాలయంలో శుక్రవారం ప్రజాశక్తి ఎడిషన్ మేనేజర్ జి.శివరామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ప్రజాశక్తి వైద్యరంగం ప్రత్యేక సంచికను పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఒ జి.చంద్రశేఖర్, ప్రజాశక్తి సిజిఎం వై.అచ్యుతరావు, పల్నాడు జిల్లా సిపిఎం కార్యదర్శి గుంటూరు విజయకుమార్, ప్రజాశక్తి ఎడిషన్ మేనేజర్ జి.శివరామకృష్ణ, సిపిఎం నరసరావుపేట కార్యదర్శి షేక్.మసూద్ సిలార్, ప్రజాశక్తి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.