- ఫిచ్ రేటింగ్స్ అంచనా
న్యూఢిల్లీ : వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత వృద్థి రేటు 7 శాతంగా ఉండొచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశీయంగా పెరిగిన డిమాండ్, వ్యాపారం స్థిరంగా కొనసాగడమే ఇందుకు కారణమని పేర్కొంది. ప్రస్తుత 2023-24లో 7.8 శాతం పెరుగుదల ఉండొచ్చని అంచనా వేసింది. గడిచిన మూడు త్రైమాసికాలుగా దేశీయంగా 8 శాతం కంటే అధికంగా జిడిపి పెరుగుతోందని.. చివరి త్రైమాసికంలోనూ అదే స్థాయిలో ఉండొచ్చని ఫిచ్ పేర్కొంది.