Sep 17,2022 07:58

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసనసభలో పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టే సమయంలో టిడిపి సభ్యులు స్పీకరు పోడియం చుట్టముట్టి నిరసన తెలుపుతూ నినాదాలు చేస్తున్న సమయంలోనే వివిధ శాఖల మంత్రులు బిల్లులను సభలో ప్రవేశ పెట్టారు. పలు బిల్లులను సభ ఆమోదించింది. భారత స్టాంపు బిల్లును, ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల చట్టాల (సవరణ) బిల్లును రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపాదించారు. రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం సవరణ బిల్లును కూడా ప్రతిపాదించారు. ఈ మూడు బిల్లు లకూ స్పీకరు అనుమతించారు. పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ బిల్లును, రాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు, పౌరసేవల బిల్లును సభ ఆమోదించింది. వ్యవసాయ ఉత్పత్తి, పశు సంపద, మార్కెట్లు సవరణ బిల్లును వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌ ప్రతిపాదించారు. సభ ఆమోదించింది. భూ యాజమాన్య హక్కుల బిల్లును ఉపసంహ రించుకునేందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుమతి కోరగా సభ ఆమోదించింది.