Sep 18,2023 11:02

భోపాల్‌ : మణిపూర్‌లో క్రైస్తవులపై దాడులకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినందుకు క్రిమినల్‌ కేసు నమోదైన కేథలిక్‌ పాస్టర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. సైరో మలబార్‌ చర్చి పాస్టర్‌, సాగర్‌ ఆర్చ్‌ డియోసెస్‌ సభ్యుడు ఫాదర్‌ అనిల్‌ ఫ్రాన్సిస్‌ (40) మణిపూర్‌ అల్లర్ల సమయంలో క్రైస్తవులపై దాడులకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. ఆయనపై కేసు నమోదైంది. దీంతో, ఫ్రాన్సిస్‌ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని బిషప్‌ హౌస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్‌ ఈ నెల 13న బిషప్‌ హౌస్‌ను సందర్శించి ప్రార్థనలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన కనిపించలేదు. పిన్నట్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఈ నెల 14న చెట్టుకు వేలాడుతూ ఆయన మృతదేహం కనిపించింది. ఆయన చివరి కోరిక మేరకు దహన సంస్కారాలు నిర్వహించి, చితాభస్మాన్ని నదిలో కలిపినట్లు సాగర్‌ డియోసిస్‌ బిషప్‌ జేమ్స్‌ అతికాలం తెలిపారు.